Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tesla Model Y : టెస్లా సంచలన నిర్ణయం.. రూ.9 లక్షలు తగ్గిన 'మోడల్ వై' ధర..!

Tesla Model Y : టెస్లా సంచలన నిర్ణయం.. రూ.9 లక్షలు తగ్గిన 'మోడల్ వై' ధర..!

hmtv 1 week ago

Tesla Model Y

Tesla Model Y : భారత ఈవీ మార్కెట్లో తన పట్టును బలపరుచుకోవడానికి అమెరికా కార్ల దిగ్గజం టెస్లా భారీ వ్యూహాన్ని అమలు చేసింది. దేశంలో తన పాపులర్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అయిన 'టెస్లా మోడల్ వై' (Tesla Model Y) ధరను ఏకంగా రూ.9 లక్షల వరకు తగ్గిస్తూ సరికొత్త "మోడల్ వై 2026"ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్‌గా నిలిచినప్పటికీ, భారత మార్కెట్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సేల్స్ సాధించలేకపోవడంతో టెస్లా ఈ భారీ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. 5-సీటర్ , 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ఈ కారు డెలివరీలు జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

భారీగా తగ్గిన బేస్ వేరియంట్ ధర

ధరల సవరణ తర్వాత టెస్లా మోడల్ వై బేస్ వేరియంట్ కస్టమర్లకు భారీగా కలిసిరానుంది. గతంలో ఈ బేస్ మోడల్ 'రియర్ వీల్ డ్రైవ్' ప్రారంభ ధర రూ.59.89 లక్షలుగా ఉండగా, ఇప్పుడు దానిని రూ.50.89 లక్షలకు తగ్గించారు. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో రూ.67.89 లక్షల ధరతో లాంచ్ అయిన 'లాంగ్ రేంజ్' వేరియంట్ ధరలో కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు. ఇక కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ 'టెస్లా మోడల్ వై ఎల్' ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా ఉంది. అంటే ఇప్పుడు బేస్ మోడల్ వై కారు ఈ కొత్త లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ.11.1 లక్షలు చౌకగా లభిస్తోంది. ఈ కొత్త 'ఎల్' వేరియంట్‌లో ఎక్కువ స్పేస్, సీట్లు, అత్యధిక రేంజ్‌తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ సైతం లభిస్తుంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ.. అదిరిపోయే రేంజ్

టెస్లా మోడల్ వై బేస్ 5-సీటర్ ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 64kWh బ్యాటరీని అందించారు. ఇది 299 HP పవర్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 84.2kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. అంతేకాదు కేవలం 15 నిమిషాల సూపర్ ఛార్జింగ్‌తోనే దీనిని 238 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. పికప్ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీ కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లగ్జరీ ఇంటీరియర్.. మోడ్రన్ ఫీచర్లు

19-ఇంచుల స్టైలిష్ వీల్స్‌తో వచ్చే ఈ కారు లోపల ప్రీమియం ఫినిషింగ్ తో కూడిన లగ్జరీ ఇంటీరియర్‌ను అందించారు. కారు ముందు భాగంలో డ్యాష్‌బోర్డ్‌పై 16-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. మొదటి వరుసలో పవర్ రెక్లైనింగ్, పవర్ టిల్ట్ ఆప్షన్లతో పాటు హీటెడ్ , వెంటిలేటెడ్ సీట్లను ఇచ్చారు. అలాగే వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల వినోదం కోసం ప్రత్యేకంగా 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చడం విశేషం. కారులో అద్భుతమైన థియేటర్ లాంటి సౌండ్ కోసం 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను, అలాగే భద్రత , నిఘా కోసం కారు చుట్టూ 8 హై-టెక్ కెమెరాలను టెస్లా ఏర్పాటు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu