Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thalapathy Vijay: విజయ్‌తో రిలేషన్‌పై హీరోయిన్‌కు నీచంగా ప్రశ్నలు

Thalapathy Vijay: విజయ్‌తో రిలేషన్‌పై హీరోయిన్‌కు నీచంగా ప్రశ్నలు

hmtv 1 week ago

Thalapathy Vijay: విజయ్‌తో రిలేషన్‌పై హీరోయిన్‌కు నీచంగా ప్రశ్నలు

Thalapathy Vijay: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ రాయడం, ఇంటర్వ్యూలలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది.

కేవలం వ్యూస్, రేటింగ్స్ కోసమే కొందరు జర్నలిస్టులు హద్దులు దాటుతున్నారు. తాజాగా ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురవడంతో, టాలెంటెడ్ బ్యూటీ మాళవికా మోహనన్ కోలీవుడ్ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టార్ హీరో విజయ్‌తో తనకున్న బంధాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల మాళవిక మోహనన్ పాల్గొన్న ఒక ఈవెంట్‌లో కొందరు తమిళ జర్నలిస్టులు హద్దులు దాటి ప్రవర్తించారు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన దళపతి విజయ్‌ను ఉద్దేశించి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ప్రయాణాలను ముడిపెడుతూ కొన్ని ఇబ్బందికరమైన, అసందర్భమైన ప్రశ్నలు వేశారు. కేవలం రేటింగులు, సెన్సేషన్ కోసమే కొందరు జర్నలిస్టులు చాలా అసభ్యకరంగా ప్రశ్నలు అడిగారని మాళవిక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళ మీడియా రంగంపై తనకు ఎంతో గౌరవం ఉందంటూనే, ఆ ఈవెంట్‌లో కొందరి ప్రవర్తన అస్సలు బాలేదని మండిపడ్డారు.

"ఒకరి వ్యక్తిగత జీవితాన్ని లేదా పవిత్రమైన స్నేహాన్ని కేవలం క్లిక్స్ కోసం సెన్సేషనలైజ్ చేయడం మానుకోవాలి. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు కాస్త హుందాగా, గౌరవప్రదంగా నడుచుకోవాలి" అంటూ మాళవికా మోహనన్ మీడియాకు హితబోధ చేశారు. దళపతి విజయ్‌తో తనకున్న ఏడేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాళవిక భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్‌పై తనకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా చాటిచెప్పారు. 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమా సమయం కంటే ముందు నుంచే, అంటే గత ఏడు సంవత్సరాలుగా విజయ్ సార్ తనకు మంచి స్నేహితుడు.

ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఆయన ఈరోజు రీల్ లైఫ్‌లోనే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ సాధించిన ఎదుగుదల నిజంగా అద్భుతం. ఒక వ్యక్తిగా, నటుడిగా ఆయనపై నాకు ఎనలేని గౌరవం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తిని నా స్నేహితుడిగా చెప్పుకోవడానికి నేనెప్పుడూ గర్వపడతాను. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాళవిక, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇన్నాళ్లూ కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ కుట్టి, ఇటీవల ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' చిత్రం ద్వారా నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. సెలబ్రిటీలైనా సరే, వారికి వ్యక్తిగత జీవితం, ప్రైవసీ ఉంటాయని మీడియా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక స్టార్ హీరోతో ఉన్న పవిత్రమైన స్నేహ బంధాన్ని రేటింగుల కోసం వాడుకోవాలని చూసిన వారికి మాళవిక ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu