Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thipparthy: మాజీ సర్పంచ్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి

Thipparthy: మాజీ సర్పంచ్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి

hmtv 1 week ago

Thipparthy: మాజీ సర్పంచ్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి

తిప్పర్తి: తిప్పర్తి మండలం రాజపేట మాజీ ఎంపీటీసీ, జొన్నగడ్డలగూడెం మాజీ సర్పంచ్ నామిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.

శనివారం ఆయన పార్థివదేహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​వెంకట్రామిరెడ్డి మృతి పట్ల మంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ​నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu