Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thoguta: సర్కారు బడిలోనే బంగారు భవిష్యత్తు.. హెచ్‌ఎం వేంకటేశం

Thoguta: సర్కారు బడిలోనే బంగారు భవిష్యత్తు.. హెచ్‌ఎం వేంకటేశం

hmtv 1 week ago

Thoguta: సర్కారు బడిలోనే బంగారు భవిష్యత్తు.. హెచ్‌ఎం వేంకటేశం

Thoguta: విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం వెంకటేశం, గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

బడిబాట కార్యక్రమం లో భాగంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.

ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు జ్ఞాన దేవాలయాలుగా నిలుస్తున్నాయని, అలాంటి సర్కారు బడులను కాపాడుకోవడం ప్రతి గ్రామస్తుడి సామాజిక బాధ్యత అని కోరారు.ప్రతి చిన్నారి బడిబాట పట్టి విద్యను అభ్యసిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, చదువుతోనే జీవితాల్లో వెలుగు నిండుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, గ్రామ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.

సర్కారు బడి మనకు గర్వకారణమని ప్రతి విద్యార్థి ని ప్రయివేట్ కు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.విద్యతోనే సమాజానికి నిజమైన అభివృద్ధి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu