Thoguta: వెంకట్రావుపేటలో తెలంగాణ అవతరణ సంబరాలు
తొగుట: జల దృశ్యంలో చిన్న ధారగా మొదలై తెలంగాణలోని సబ్బండ వర్గాలను తనలో కలుపుకొని..దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోనివెంకట్రావుపేటలో సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి పాల్గొన్నారు..తెలంగాణ తల్లి, రాజ్యాంగ నిర్మాత డా: బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
సాధించుకొన్న రాష్ట్రాన్ని కెసిఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు.. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటికోసం, కరెంటు కోసం అష్ట కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. నాడు తెలంగాణ అంటేనే వెక్కిరించిన గొంతులు, నేడు మన వెన్నంటి వొచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ గారి కార్యదీక్షా దక్షతకే దక్కుతుందన్నారు.. నాడు తెలంగాణ వొస్తే ఎమోస్తాయో అని చెప్పిన కేసీఆర్ ..నిధులు, నీళ్లు, నియామకాలు అందించారు.

