Dailyhunt
Tirupati: ఆటోలు, లారీలు జాగ్రత్త! నాయుడుపేట పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Tirupati: ఆటోలు, లారీలు జాగ్రత్త! నాయుడుపేట పోలీసుల స్పెషల్ డ్రైవ్!

hmtv 0 months ago

Tirupati: ఆటోలు, లారీలు జాగ్రత్త! నాయుడుపేట పోలీసుల స్పెషల్ డ్రైవ్!

తిరుపతి జిల్లా: నాయుడుపేట పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ నియంత్రణకు నాయుడుపేట పట్టణ ప్రజలు సహకరించాలని నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం మీడియా తో మాట్లాడుతూ బస్టాండ్, బజారు, పురవీధుల సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంవల్ల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు స్థలాలను ఆక్రమించి దుకాణదారులు, తోపుడు బండ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పలువురు దుకాణదారులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణకు దుకాణదారులు వ్యాపారస్తులు సహకరించుకుంటా ఉంటే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, అలాగే వారి వారి దుకాణాల ముందు వాహనాల పార్కింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తే అటువంటి వారిపై తగు చర్యలు చేపడతామన్నారు. పట్టణములోకి పెద్దపెద్ద వాహనాల లారీలకు అనుమతులు లేవని వారికి నిర్ణయించిన సమయంలోనే మాత్రమే పట్టణంలోకి రాకపోకలు సాగించాలన్నారు, ఎక్కువగా ఆటో డ్రైవర్లు సంబంధించిన ఇన్సూరెన్స్, లైసెన్స్ వాహనాల్లో పత్రాలను పెట్టుకొని ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తే అలాంటి వారి పైన కూడా కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధానంగా యువత మత్తుకు బానిసై దివ్య చక్ర వాహనాలపై ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తున్నారని అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu