Tiruvuru: తిరువూరులో మెడికల్ షాపుల బంద్.. 4 మండలాల్లో దుకాణాలు క్లోజ్!
తిరువూరు: కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ డ్రగ్గిస్ట్ (AIOCD) పిలుపు మేరకు స్వచ్ఛందంగా మూతపడ్డ షాపులు.
తిరువూరు, విసన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరు మండలాల్లో మూతపడ్డ 200 మెడికల్ షాపులు. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు, (ఈ- ఫార్మసీస్), భారీ డిస్కౌంట్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.20 నుండి 50% వరకు భారీ డిస్కౌంట్ లో ఇస్తూ మెడికల్ షాపులను దెబ్బతిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఇచ్చిన హోమ్ డెలివరీ సడలింపులు రద్దు చేయాలని ఏఐఓసిడి డిమాండ్ చేస్తుంది. ఆన్‌లైన్ మందుల అమ్మకాల వల్ల మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

