Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trisha : ఆ హీరోతో నటించినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా

Trisha : ఆ హీరోతో నటించినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా

hmtv 6 days ago

Mahesh Babu : టాప్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ, ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే, గతంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి త్రిష చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సెట్స్ లో ఎలా ఉంటారు? ఆయన డెడికేషన్ ఎలాంటిది? అనే విషయాలపై త్రిష పంచుకున్న సీక్రెట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేష్ బాబు, త్రిషలకు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే పరిచయం ఉందట. మహేష్ బాబు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలోనే పెరిగారు. ఆ సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కాలేజీ రోజుల్లోనే వీరిద్దరికీ ఒకరికొకరు తెలుసని త్రిష గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అది కేవలం ఒక సాధారణ హాయ్, బాయ్ పరిచయం మాత్రమే. భవిష్యత్తులో మేమిద్దరం ఇంత పెద్ద స్టార్స్ అవుతామని, కలిసి సినిమాలు చేస్తామని అస్సలు ఊహించలేదు" అని త్రిష పేర్కొన్నారు.

షూటింగ్ సమయంలో మహేష్ బాబు చూపించే అంకితభావం చూసి తాను షాక్ అయ్యానని త్రిష చెప్పుకొచ్చారు. కొన్ని కష్టమైన సీన్స్ తీసేటప్పుడు 8 గంటలు కాగానే నేను అలసిపోయి ప్యాకప్ చెప్పేసి వెళ్లాలనుకునేదాన్ని. కానీ మహేష్ మాత్రం ఉదయం నుంచి రాత్రి 10:30 గంటలైనా సెట్ లోనే కూర్చుని వర్క్ చేసేవారు. ఆయన అంకితభావం చూసి నేనే గిల్టీగా ఫీలయ్యేదాన్ని అని త్రిష చెప్పుకొచ్చారు. సాధారణంగా స్టార్ హీరోలు షాట్ గ్యాప్‌లో వానిటీ వ్యాన్‌లోకి వెళ్ళిపోతుంటారు. కానీ మహేష్ బాబు ఎప్పుడూ అలా వెళ్లడం తాను చూడలేదని త్రిష అన్నారు. అది తన సీన్ అయినా, కమెడియన్ సీన్ అయినా ఆయన ఎప్పుడూ మానిటర్ ముందే కూర్చుని గమనిస్తూ ఉంటారని త్రిష తెలిపారు.

మహేష్ బాబు ప్రొఫెషనలిజం గురించి త్రిష ప్రశంసల జల్లు కురిపించారు. మహేష్ బాబు తనతోటి నటులను, వారి నటనను ఎంతగానో గౌరవిస్తారు. వేరే వాళ్ల సీన్స్ జరుగుతున్నప్పుడు ఆయన మానిటర్ ముందు కూర్చున్నా.. ఎప్పుడూ ఎవరి పనిలోనూ జోక్యం చేసుకోరు. ఎవరి శైలిలో వారిని నటించనిస్తారు. ఒక సూపర్‌స్టార్ నుండి తోటి ఆర్టిస్టులకు అలాంటి స్పేస్, గౌరవం లభించడం అద్భుతం అని త్రిష కొనియాడారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు', 'సైనికుడు' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'అతడు' సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ ఎప్పటికీ టాలీవుడ్ బెస్ట్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu