Trisha Visits Vijays Home to Celebrate TVK Victory
Trisha: తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదవుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ విజయకేతనం ఎగురవేస్తూ అధికార పీఠం దిశగా దూసుకుపోతోంది.
ఈ చారిత్రాత్మక విజయం వేళ, విజయ్ నివాసంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తిరుమల నుంచి నేరుగా విజయ్ ఇంటికి..
నటి త్రిష నేడు (మే 4, 2026) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె, అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం సాధిస్తున్న తరుణంలో, త్రిష ఆయనను కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విజయ్ నివాసానికి త్రిష చేరుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

