Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tuni: తుని రైల్వే స్టేషన్ గుంత మాయం HMTV కథనానికి సత్వర స్పందన!

Tuni: తుని రైల్వే స్టేషన్ గుంత మాయం HMTV కథనానికి సత్వర స్పందన!

hmtv 4 days ago

Tuni: తుని రైల్వే స్టేషన్ గుంత మాయం HMTV కథనానికి సత్వర స్పందన!

తుని: రైల్వే స్టేషన్ ఎదుట వాహనదారులకు నిత్యం నరకప్రాయంగా మారిన భారీ గుంతకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.

ఈ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను HMTV ద్వారా కథనంగా ప్రచురించిన విషయం తెలిసిందే.

​సత్వర స్పందన: ప్రజా సమస్య తీవ్రతను, ప్రమాదాల హెచ్చరికను HMTV కథనం ద్వారా గుర్తించిన R&B అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమస్యను సానుకూలంగా తీసుకున్న డివిజనల్ ఇంజనీర్ (DE) , తమ హామీ మేరకు యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టి, ఆ ప్రమాదకర గుంతను పూడ్చి రోడ్డును బాగు చేశారు.

​ప్రజల హర్షం: "ఈ గుంత వల్ల అదుపుతప్పి పడటం, వాహనాల టైర్లు పాడవటం వంటివి నిత్యకృత్యమయ్యాయి. HMTVలో వార్త రాగానే అధికారులు స్పందించి పనులు చేయించడం అభినందనీయం" అని స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu