Dailyhunt
TVK: ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని 'తళపతి'కి గవర్నర్ ఆహ్వానం!

TVK: ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని 'తళపతి'కి గవర్నర్ ఆహ్వానం!

hmtv 2 days ago

TVK: ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని 'తళపతి'కి గవర్నర్ ఆహ్వానం!

TVK: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ఆహ్వానం పంపారు.

ఈ మేరకు రాజ్‌భవన్ (లోక్‌భవన్) ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకే స్వయంగా ఆ మార్కును అందుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 10 అడుగుల దూరంలో నిలిచిన తరుణంలో, విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ అనూహ్య మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేస్తూ అధికారిక లేఖ విడుదల చేసింది.

మతతత్వ శక్తులను ఏ రకంగానూ ప్రోత్సహించకూడదని, పెరియార్ మరియు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని విజయ్‌కు కాంగ్రెస్ షరతు పెట్టింది. దీనికి విజయ్ అంగీకరించడంతో సిఎల్పీ (CLP) సమావేశంలో మద్దతుపై తుది నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్ ఆహ్వానం అందిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వారాల గడువులోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటామని టీవీకే ఇప్పటికే గవర్నర్‌కు నివేదించింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే, దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడి, ఒక సినీ నటుడు నేరుగా సీఎం పీఠం అధిష్టించిన అరుదైన ఘట్టం నమోదు కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu