Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Uppal: ఉప్పల్ పీహెచ్‌సీ కి కూలర్లు అందజేసిన ఎమ్మెల్యే బండారి

Uppal: ఉప్పల్ పీహెచ్‌సీ కి కూలర్లు అందజేసిన ఎమ్మెల్యే బండారి

hmtv 1 week ago

Uppal: ఉప్పల్ పీహెచ్‌సీ కి కూలర్లు అందజేసిన ఎమ్మెల్యే బండారి

Uppal: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రోగులు, వైద్య సిబ్బందికి ఉపశమనం కలిగించే లక్ష్యంతో కాలేరు యమునాబాయి ట్రస్ట్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూలర్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూలర్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి సమయంలో కూలర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. సేవా భావంతో ముందుకు వస్తున్న కాలేరు యమునాబాయి ట్రస్ట్ ప్రతినిధులను, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న ఉప్పల్ ప్రెస్ క్లబ్(ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్) సభ్యులను ఆయన అభినందించారు.

సమాజానికి అవసరమైన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలేరు యమునాబాయి ట్రస్ట్ చైర్మన్ కాలేరు జై నవీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా క్లబ్ సభ్యులు ముందుంటారని చెప్పారు.

త్వరలో క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడంతో పాటు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సౌశిల్యారాణి, ఫార్మసిస్ట్ నగేష్, ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆనందా నరసింహారెడ్డి, ముఖ్య సలహాదారులు కంచుకట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పయ్యవుల సంతోష్, ఉపాధ్యక్షులు ఎడపాక సురేష్, బోడ ప్రవీణ్, ఓరుగంటి నరేందర్, కార్యనిర్వాహణ కార్యదర్శి కరుణాకర్, జాయింట్ సెక్రెటరీ డి దేవకుమార్, సంస్కృతిక కార్యదర్శి షేక్ యాకూబ్ పాషా, కోశాధికారి రెడ్డి మల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu