Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Uppal: ఉప్పల్‌లో కాంగ్రెస్ సంబరాలు.. కాప్రా చెరువుకు పూర్వవైభవం

Uppal: ఉప్పల్‌లో కాంగ్రెస్ సంబరాలు.. కాప్రా చెరువుకు పూర్వవైభవం

hmtv 1 week ago

Uppal: ఉప్పల్‌లో కాంగ్రెస్ సంబరాలు.. కాప్రా చెరువుకు పూర్వవైభవం

Uppal: కాప్రా చెరువును రూ35కోట్లతో అభివృద్ధి చేపడుతున్న సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన కాప్రా సర్కిల్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సూచన మేరకు కాప్రా చెరువు వద్ద సియం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశామని కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి తెలిపారు.

పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో గౌరవ ముఖ్యమంత్రి కాప్రా చెరువు అభివృద్ధి కోసం రూ.35 కోట్ల నిధులను మంజూరు చేయడం ఎంతో ఆనందకరం. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగన్న కాప్రా చెరువు అభివృద్ధి ప్రాజెక్ట్ ఇప్పుడు నిజమవుతోందన్నారు.

చెరువు గతంలో స్థానిక కాప్రా, గాంధీనగర్, ఎల్లారెడ్ది గూడ, కందిగూడ, కుషాయిగూడ గ్రామాలకు వ్యవసాయానికి జీవనధారగా ఉండేదని, పట్టనీకరణలో చెరువు ఖబ్జాలకు గురై, అభివృద్ధికి నోచుకోక అడుగంటసాగిందని వాపోయారు. ఇప్పుడు ప్రజాపాలనలో హైడ్రా చెరువుల పునరుద్దరణ ద్వారా కాప్రా చెరువుకు గత వైభవం రానుందని స్థానిక గ్రామాలు, కాలనీల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాప్రా చెరువు అభివృద్ధి జరిగితే భూగర్భ జలనిల్వలు పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత మెరుగైతుందని,

చెరువు మధ్యలో ఐలాండ్, బతుకమ్మ కుంట, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సేదతీరడానికి ఆహ్లాదకరమైన పార్క్లు, సుందరమైన విధ్యుత్ వెలుగులతో అద్భుతంగా అభివృద్ధి చెందనున్నదని పేర్కొన్నారు.గతంలో ప్రభుత్వాలు కాప్రా చెరువు అభివృద్ధిపై హామీలు ఇచ్చినా, అవి మాటలకే పరిమితమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పరమేశ్వర్ రెడ్డి కృషి అభినందనీయం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి కాప్రా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న డైనమిక్ సీఎం రేవంతన్న నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాప్రా చెరువు వద్ద జరిగిన పాలాభిషేకం అనంతరం, పరిసర కాలనీల ప్రజలకు,మార్నింగ్ వాకర్స్ కు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతారాం రెడ్డి,మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, ఏ ఏం సి డైరెక్టర్ పూర్ణయాదవ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజు పాకాల, సెక్రటరీ మురళీ దండ్ల కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్, కాప్రా సర్కిల్ లోని వివిధ డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పొలేపాక అంజయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజిరెడ్డి, గడ్డం యాదగిరి,

పి పవన్ కుమార్, పడమటి మల్లారెడ్డి, బాబురావు,శ్రీధర్ రెడ్డి, వినోద్ కుమార్, నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, తన్నీరు శ్రీహరి,రాకేష్ యాదవ్, కొబ్బనూరి నాగరాజు, రిజ్వాన్ ఖాన్, సత్తిరెడ్డి, జగదీష్ గౌడ్, తోటకూర శ్రీకాంత్,ఆదేపు శ్రీనివాస్, సతీష్ యాదవ్,సంతోష్ చారి, రాజు,శ్యామ్ చారి,వినోద్, గుణశేఖర్,రాజశీలన్, నాగరాజు యాదవ్,కాప్రా డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్,ఆకుల సంతోష్, ఇమ్రాన్, విజయ్, శఫీ, మానస్, శివ, భరత్ తదితరులు మరియు కాప్రా సర్కిల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu