Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vastu Tips: ఎంత కష్టపడినా ఉద్యోగం, వ్యాపారంలో విజయం రావడం లేదా?

Vastu Tips: ఎంత కష్టపడినా ఉద్యోగం, వ్యాపారంలో విజయం రావడం లేదా?

hmtv 1 week ago

Vastu Tips: ఎంత కష్టపడినా ఉద్యోగం, వ్యాపారంలో విజయం రావడం లేదా?

Vastu Tips: ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఇంట్లో ఆర్థికంగా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అయితే కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావు. అయితే దీని వాస్తు లోపాలు కూడా కారణమవుతతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర దిశను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి

వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశను ధనం, ఉద్యోగం, అభివృద్ధికి సంబంధించిన దిశగా భావిస్తారు. ఈ దిశ సంపదకు అధిపతిగా భావించే కుబేరుడితో సంబంధం కలిగి ఉందని చెబుతారు. అందుకే ఇంటి లేదా కార్యాలయంలో ఉత్తర దిశను ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా, క్రమబద్ధంగా ఉంచాలి. ఈ ప్రాంతంలో బరువైన వస్తువులు, పాడైన సామాన్లు లేదా చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పని చేసే సమయంలో సరైన దిశలో కూర్చోవాలి

ఆఫీస్‌లో పనిచేసేవారైనా, ఇంటి నుంచి పని చేసేవారైనా కూర్చునే దిశపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం పని చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టుకుని కూర్చోవడం మంచిదిగా భావిస్తారు. ఇలా కూర్చోవడం వల్ల సానుకూల శక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని నమ్మకం. అలాగే కూర్చునే సమయంలో వెనుక భాగంలో గోడ ఉండటం మంచిదని చెబుతారు. ఇది స్థిరత్వం, ఆత్మవిశ్వాసానికి సంకేతంగా భావిస్తారు.

ప్రధాన ద్వారాన్ని ఆకర్షణీయంగా ఉంచండి

ఇల్లు, దుకాణం లేదా కార్యాలయానికి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్యమైనది. సానుకూల శక్తి, లక్ష్మీదేవి ప్రవేశించే మార్గంగా దీనిని భావిస్తారు. అందుకే ప్రధాన ద్వారం వద్ద పరిశుభ్రత, సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తు, శుభ్-లాభ్ చిహ్నాలు లేదా గణపతి బొమ్మను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం.

డబ్బు పెట్టే అల్మారాకు సరైన స్థానం

వ్యాపారంలో లాభాలు పెరగాలంటే నగదు నిల్వ చేసే ప్రదేశం కూడా సరైన దిశలో ఉండాలని వాస్తు సూచిస్తుంది.

డబ్బు ఉంచే అల్మారాను నైరుతి (South-West) దిశలో ఉంచడం మంచిదని చెబుతారు. అలాగే దాని తలుపు ఉత్తర దిశ వైపు తెరుచుకునేలా ఉండాలి. ఇలా ఉంటే ధనం స్థిరంగా నిలిచి, అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్మకం.

పాడైన వస్తువులను వెంటనే తొలగించండి

ఇంట్లో లేదా కార్యాలయంలో పాడైన వస్తువులు ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దాలు లేదా గాజు పాత్రలు ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్మకం. ఇవి వ్యక్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతాయని చెబుతారు. అందుకే తరచూ ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించి అవసరం లేని వస్తువులను తొలగించాలి. అలాగే గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను కార్యాలయంలో ప్రతిష్ఠించి పూజించడం, ఉదయం-సాయంత్రం దీపం లేదా కర్పూరం వెలిగించడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు.

గమనిక: పైన తెలిపిన వివరాలు వాస్తు శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా అందించడమైంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత విశ్వాసాలు, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu