Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
VD Satheesan: కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

VD Satheesan: కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

hmtv 1 week ago

VD Satheesan: కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

VD Satheesan: కేరళ ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ ముగింపు పలికింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను ఎంపిక చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం, సతీశన్‌ నాయకత్వానికే మొగ్గు చూపింది.

ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న కె.సి.వేణుగోపాల్ మరియు మాజీ ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాల నుంచి సతీశన్‌కు గట్టి పోటీ ఎదురైంది. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు మరియు నేతల అభిప్రాయాలను సేకరించిన అనంతరం, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా సతీశన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సౌమ్యుడిగా, సమర్థుడైన పార్లమెంటేరియన్‌గా వీడీ సతీశన్‌కు మంచి పేరుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఆయన చూపిన పోరాట పటిమ, అసెంబ్లీలో ప్రభుత్వంపై చేసిన వాదపటవమే ఆయనకు ఈ పదవి దక్కేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో కేరళ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

త్వరలోనే వీడీ సతీశన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని ప్రకటించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu