Veenavanka: ఉపాధి హామీ కూలీలకు 200 సల్ల ప్యాకెట్లు పంపిణీ
వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని కుంటివాని చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులు 200 మంది కూలీలతో నిర్వహిస్తున్నారు.
వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాయణవేణి కుమార్ మంజుల దంపతుల పెళ్లిరోజు మరియు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని,అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు మరియు టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా వారి సంయుక్త నిర్వహణలో 200 మంది ఉపాధి హామీ కూలీలకు సల్ల ప్యాకెట్లు పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామపంచాయతీ కార్యదర్శి సుంకరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు నిరంతరం సమాజ సేవలో భాగంగా ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా.
అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, డీలర్ కర్రె వెంకట నర్సయ్య ,వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, 9వ వార్డు సభ్యులు గంధం ప్రశాంత్ , అమ్మ ఫౌండేషన్ సభ్యులు రాయణవేణిచంద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మోరే మహేష్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి పూదరిసమ్మయ్య,పూదరిహరీష్, రాయణవేణిసమ్మయ్య, బండారి మల్లయ్య,కనుకం శ్యాంసన్, నిమ్మల సదయ్య, రాపర్తిరాజయ్య, మేకల స్వప్న, ఉపాధి హామీ కూలీలు మరియు తదితరులు పాల్గొన్నారు.

