Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veeraghattam: చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయకృష్ణ!

Veeraghattam: చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయకృష్ణ!

hmtv 3 weeks ago

Veeraghattam: చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయకృష్ణ!

Veeraghattam: వీరఘట్టంమండలంలో చెరువు అభివృద్ధి పనుల పరిశీలన గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా రూ.50 లక్షలు మంజూరైన చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ వీరఘట్టం మండలం వీరఘట్టం మేజర్ పంచాయతీ లో ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

చెరువు అభివృద్ధి ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం కలిగి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కూటమి పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మి నారాయణ, కూటమి మండల నాయుకులు ఉదయాన ఉదయ్ భాస్కర్,అరుకుపార్లమెంట్ సమాచారసేకరణ అబ్జర్వ్ జనసేన జానీ, కళింగ కోమటి స్టేట్ డైరక్టర్ తూముల రమేష్,నివర్తి శశిభూషణం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu