Veldanda: జాతీయస్థాయి తంగ్-తా పోటీలకు కస్తూర్బా విద్యార్థిని ఎంపిక
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రస్థాయి తంగ్-తా మార్షల్ ఆర్ట్స్ ఎంపిక పోటీలలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థిని వద్యావత్ సింధు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
సింధు అండర్-17 బాలికల విభాగంలో, 48 కిలోల బరువు కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 30 అక్టోబర్ 2026న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి తంగ్-తా మార్షల్ ఆర్ట్స్ పోటీలలో ఆమె పాల్గొననుంది.
ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బిట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలలో సింధు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఆమె ఈ విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.

