Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Venkatesh Iyer : సీఎం విజయ్ స్టైల్‌లో గ్రౌండ్‌లోనే మాస్ సెలబ్రేషన్

Venkatesh Iyer : సీఎం విజయ్ స్టైల్‌లో గ్రౌండ్‌లోనే మాస్ సెలబ్రేషన్

hmtv 1 week ago

Venkatesh Iyer : సీఎం విజయ్ స్టైల్‌లో గ్రౌండ్‌లోనే మాస్ సెలబ్రేషన్

Mersal Style : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు అసలైన సండే ట్రీట్ దొరికింది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో ఆర్‌సీబీ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. పరుగుల వరద పారించి 222 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా.. ఉత్కంఠభరిత పోరులో 23 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మ్యాచ్‌కు ముందే ఆర్‌సీబీకి ఒక గట్టి షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రజత్ పటీదార్ గాయపడటంతో, అతని స్థానంలో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు వెంకటేష్ అయ్యర్. వచ్చిన అవకాశం చిన్నదైనా.. ప్రదర్శన మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. పంజాబ్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకుంటూ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మైదానంలో అయ్యర్ చేసిన బాదుడు చూసి చివరకు పంజాబ్ కెప్టెన్ కూడా ఏం చేయాలో తెలియక చేతులెత్తేసాడు.

వెంకటేష్ అయ్యర్ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు.. తన సెలబ్రేషన్ స్టైల్‌తోనూ స్టేడియాన్ని ఊపేసాడు. మైదానంలో ఫోర్ల వర్షం కురిపిస్తూ హాఫ్ సెంచరీ మార్కును దాటిన తర్వాత వెంకటేష్ అయ్యర్ ఒక ఐకానిక్ సెలబ్రేషన్ చేశాడు.తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, అలాగే టీవీకే పార్టీ అధినేత అయిన దళపతి విజయ్ సూపర్ హిట్ సినిమా 'మెర్సల్'లో చేసిన ఒక ఐకానిక్ మేనరిజంను మైదానంలో రీక్రియేట్ చేశాడు. వెంకటేష్ అయ్యర్ విజయ్ స్టైల్‌లో చేతులు తిప్పుతూ ఇచ్చిన ఈ మాస్ పోజ్ చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు దళపతి విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వెంకటేష్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. అనంతరం 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు గట్టిగానే పోరాడింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ.. ఆర్‌సీబీ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి పంజాబ్‌ను కట్టడి చేశారు. చివరకు పంజాబ్ కింగ్స్‌పై ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని ప్లే-ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu