Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడలో 'పెద్ది' జాతర.. రామ్ చరణ్ 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

విజయవాడలో 'పెద్ది' జాతర.. రామ్ చరణ్ 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

hmtv 2 weeks ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

తాజాగా విజయవాడలో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాలోని పవర్‌ఫుల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ ట్రాక్ 'మస్సా మస్సా'వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

చరణ్ కష్టానికి హాండ్స్ అప్.. రోమాలు నిక్కబొడిచే విజువల్స్!

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను స్టార్ సింగర్ విశాల్ మిశ్రా అంతే పవర్‌ఫుల్‌గా ఆలపించగా, ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మోటివేషనల్ లిరిక్స్ అందించారు. ఇక లిరికల్ సాంగ్‌తోనే హల్చల్ చేసిన ఈ ట్రాక్.. ఇప్పుడు వీడియో సాంగ్‌తో నెట్టింట పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం చరణ్ పడిన కష్టం, ఆయన చూపించిన హెవీ ఫిజికల్ మేకోవర్, మండుటెండలో గంటల తరబడి మట్టిలో చేసిన ప్రాక్టీస్ విజువల్స్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం. చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ అని చెప్పొచ్చు.

జూన్ 4న థియేటర్లలో 'పెద్ది' దండయాత్ర

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి క్రేజీ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆడియో పరంగా ఇప్పటికే సంచలనం సృష్టించిన 'మస్సా మస్సా' వీడియో సాంగ్‌కు కూడా సోషల్ మీడియాలో రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జూన్ 4న బాక్సాఫీస్ వద్ద చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu