Vikarabad: బైక్ దొంగలు లభ్యం సినిమాల్లాంటి చాకచక్యంతో పట్టుకున్న స్థానికులు
Vikarabad: జిల్లా కేంద్రంలో రెండు బైకులను దొంగిలించి పారిపోతున్న ఇద్దరు అనుమానిత దొంగలను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం వారిని వికారాబాద్ పోలీసులకు అప్పగించారు.
స్థానికుల వివరాల ప్రకారం రెండు బైకులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు వాటిపై వికారాబాద్ నుంచి మోమిన్‌పేట్ రోడ్డులో పారిపోతుండగా స్థానికులు అనుమానం వచ్చి వారిని వెంబడించారు. కొంతదూరం వెళ్లిన అనంతరం ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌కు చెందినవారిగా వెల్లడైనట్లు సమాచారం. మియాపూర్ నుంచి మొత్తం ఐదుగురు వికారాబాద్‌కు వచ్చినట్లు, వికారాబాద్‌లో కూడా ఒక వ్యక్తితో తమకు సంబంధాలు ఉన్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇద్దరు అనుమానితులు వికారాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని పోలీసులు విచారిస్తూ గతంలో మరెక్కడైనా బైకులు లేదా ఇతర వస్తువులను దొంగిలించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనాల వెనుక మరెవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

