Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vikarabad: వికారాబాద్ 74 శాతం పూర్తయిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ

Vikarabad: వికారాబాద్ 74 శాతం పూర్తయిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ

hmtv 1 week ago

Vikarabad: వికారాబాద్ 74 శాతం పూర్తయిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ

Vikarabad: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ 74 శాతం పూర్తయిందని జిల్లా అదనపు కలెక్టర్ కె.వెంకటా చారి తెలిపారు.

శనివారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్, మ్యాపింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్ష సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. రాష్టంలో త్వరలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జూన్ 15 నుండి నిర్వహించే షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటాచారి మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతామని తెలిపారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న బూత్ స్థాయి అధికారుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆయన వివరించారు.

కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓలు వాసు చంద్ర, అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ హాలీ, తహసిల్దార్ లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu