Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

hmtv 6 days ago

Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

Vikarabad: జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి కే. విజయభాస్కర్ ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 01 గంజాయి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు గంజాయిని రైలు ద్వారా తరలించి అమ్మకాలు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు DTF వికారాబాద్, SHO వికారాబాద్, ఈగిల్ టీం, GRP, RPF వికారాబాద్ టీంలు మూకుమ్మడి దాడులు నిర్వహించాయి.

వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీ చేయగా 01 లగేజీ బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండడంతో పరిశీలించగా 17.145 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని తరలించిన వ్యక్తుల వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతుందని జిల్లా మద్య నిషేధ అధికారి కే. విజయభాస్కర్ తెలిపారు. ఈ దాడుల్లో DTF సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రేమ్ కుమార్ రెడ్డి, SHO వికారాబాద్ ఎస్సై శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమంగా గంజాయిని అమ్మడం, కలిగి ఉండటం, సరఫరా చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కింది నంబర్లకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

మాదక ద్రవ్యాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఎంతగానో కృషి చేస్తుందని, నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి కే. విజయభాస్కర్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu