Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinjamur: పాలవాగు సమీపంలో శవమైన ఎలక్ట్రిషియన్.. ఘటనాస్థలంలో ఎమ్మెల్యే కాకర్ల!

Vinjamur: పాలవాగు సమీపంలో శవమైన ఎలక్ట్రిషియన్.. ఘటనాస్థలంలో ఎమ్మెల్యే కాకర్ల!

hmtv 4 days ago

Vinjamur: పాలవాగు సమీపంలో శవమైన ఎలక్ట్రిషియన్.. ఘటనాస్థలంలో ఎమ్మెల్యే కాకర్ల!

నెల్లూరు జిల్లా: వింజమూరు మండలంలోని వింజేటమ్మకొండ మార్గంలో పాలవాగు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధార్ కార్డు,బైక్ నంబర్ ఆధారంగా మృతుడు కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ శ్రీకాంత్‌గా గుర్తించారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం శ్రీకాంత్ శనివారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించగా,వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.మృతికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు.ఇది ప్రమాదవశాత్తు జరిగిందా,లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితులున్నాయా అనే దానిపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu