Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinukonda: ఏ గ్రామంలోనైనా తేల్చుకుందాం.. జగన్‌కు చీఫ్ విప్ జీవీ సవాల్

Vinukonda: ఏ గ్రామంలోనైనా తేల్చుకుందాం.. జగన్‌కు చీఫ్ విప్ జీవీ సవాల్

hmtv 3 days ago

Vinukonda: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.

ఈపూరు మండలంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన జీవీ, ఈపూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తాజాగా వైఎస్ జగన్ విలేఖరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై జీవీ ఆంజనేయులు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదని జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు.

"జగన్.. నువ్వు ఏ ఊరికి రమ్మంటావో చెప్పు, దమ్ముంటే వినుకొండ నియోజకవర్గంలో నువ్వు కోరుకున్న గ్రామానికి రా..! అక్కడ ప్రతి ఒక్కరికీ సూపర్ సిక్స్ పథకాలు ఎలా అందుతున్నాయో కళ్లారా చూపిస్తా...!, అని జగన్‌కు జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, చదువుకునే ప్రతి బిడ్డకూ లబ్ధి చేకూర్చే 'తల్లికి వందనం' వంటి కార్యక్రమాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పింఛన్లను రూ. 3వేల నుండి రూ. 4వేలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఏటా ఇస్తున్నామన్నారు. ఇన్ని పథకాలు ప్రజలకు అందుతున్నా, అవి అందడం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని జీవీ ఆంజనేయులు తిప్పికొట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu