Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinukonda: వినుకొండ మార్కెట్ యార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

Vinukonda: వినుకొండ మార్కెట్ యార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

hmtv 1 week ago

వినుకొండ: మార్కెట్ యార్డులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటి పరిసరాలను శుభ్రం చేసి మొక్కలకు నీరు పోశారు.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే G. V. ఆంజనేయులు చొరవతో నియోజకవర్గంలో వ్యవసాయ, పర్యావరణ రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని తెలిపారు.

వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వ ఉంచిన రైతులకు రూ.30.33 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ అవుతోందన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు అందిస్తూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu