Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinukonda: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం!

Vinukonda: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం!

hmtv 5 days ago

Vinukonda: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం!

Vinukonda: వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలోని రక్త నిల్వల కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న రోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండీషనర్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

అయితే ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. రోగులు, వైద్య సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అధికారులు ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu