Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vinukonda: వినుకొండలో రూ.19.67 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Vinukonda: వినుకొండలో రూ.19.67 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

hmtv 4 days ago

వినుకొండ: నియోజకవర్గంలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 46 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19.67 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, అత్యవసర వైద్య చికిత్సల కోసం ముందస్తు ఎల్ఓసీలు కూడా మంజూరు చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 23 నెలల్లో వినుకొండ నియోజకవర్గంలో 1,904 మంది లబ్ధిదారులకు రూ.12.75 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu