Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Viral : తులం బంగారం రూ.185.. మేకింగ్ ఛార్జీలు రూ.15.. ఏంటి నమ్మలేకపోతున్నారా?

Viral : తులం బంగారం రూ.185.. మేకింగ్ ఛార్జీలు రూ.15.. ఏంటి నమ్మలేకపోతున్నారా?

hmtv 1 week ago

Gold Price

Gold Price

Viral : ప్రస్తుతం బంగారం కొనాలంటే సామాన్యులు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పాత జ్యువెలరీ బిల్లు విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

సుమారు 56 ఏళ్ల క్రితం బంగారం ధరలు ఎంత తక్కువగా ఉండేవో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జైపూర్‌కు చెందిన 'శ్యామ్ జ్యువెలర్స్' పేరుతో ఉన్న ఈ బిల్లు 1969-70 కాలం నాటిది. అప్పట్లో ఒక బంగారు గొలుసు కొంటే ఎంత అయ్యిందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు!

తులం బంగారం కేవలం రూ.185 మాత్రమే

వైరల్ అవుతున్న ఆ పాత బిల్లు ప్రకారం.. అప్పట్లో 20 గ్రాముల బరువున్న 22 క్యారెట్ల బంగారు గొలుసు ధర కేవలం రూ.370 మాత్రమే. అంటే 10 గ్రాముల (తులం) బంగారం ధర కేవలం రూ.185 అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ నగను తయారు చేయడానికి తీసుకున్న మేకింగ్ ఛార్జీలు కేవలం రూ.15. ఇక వెండి ధరల విషయానికి వస్తే, 100 గ్రాముల వెండి కేవలం రూ.60లకే వచ్చేది. నేడు అదే 100 గ్రాముల వెండి కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

అప్పుడే కొని ఉంటే ఇప్పుడు కోటీశ్వరులమే

ఈ బిల్లు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మా తాతలు అప్పట్లో ఒక కేజీ బంగారం కొని ఉంటే, ఈ పాటికి మేము కోటీశ్వరులమైపోయేవాళ్లం" అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిపోయిందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1970 కాలంలో సామాన్యులకు కూడా బంగారం అందుబాటులో ఉండేదని, పెళ్లిళ్లలో తులాల కొద్దీ బంగారం సులభంగా కొనేవారని పాత తరం వారు గుర్తు చేసుకుంటున్నారు.

56 ఏళ్లలో 800 రెట్లు పెరిగిన ధర

1970 నుంచి 2026 వరకు అంటే ఈ 56 ఏళ్ల కాలంలో బంగారం ధరలు ఏకంగా 800 రెట్లకు పైగా పెరిగాయి. అప్పట్లో వందల్లో ఉన్న ధర, నేడు 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.62 లక్షలకు, 22 క్యారెట్ల బంగారం రూ.1.49 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం, విపరీతమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు చుక్కలను తాకాయి. బంగారం కేవలం అలంకరణ వస్తువుగానే కాకుండా, సురక్షితమైన పెట్టుబడిగా మారడం వల్లే ఈ స్థాయిలో ధరలు ఎగబాకాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu