Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Visakhapatnam: ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి

Visakhapatnam: ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి

hmtv 3 weeks ago

Visakhapatnam: ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి

విశాఖపట్నం: విశాఖలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు వేములవలస గ్రామానికి చెందిన బాలికను చెవికి సంబంధించిన శస్త్రచికిత్స కోసం ఆసుపత్రి లో చేర్పించారు శస్త్రచికిత్సకు ముందు మత్తుమందు ఇచ్చిన అనంతరం బాలిక రక్తపోటు (బీపీ) పెరిగిందని, దీంతో ఆపరేషన్‌ను నిలిపి వేసి ఐసీయూకు తరలించి నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

24 గంటల పాటు బాలిక స్పృహలోకి రాదని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు అయితే అర్ధరాత్రి సమయంలో బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఇక బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణ చెవి ఆపరేషన్ కోసం ఆసు పత్రికి తీసుకెళ్లిన తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవ డానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరో పిస్తున్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu