Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Wanaparthy: రాజపేట శివారులో రైతుల రాస్తారోకో!

Wanaparthy: రాజపేట శివారులో రైతుల రాస్తారోకో!

hmtv 0 months ago

Wanaparthy: రాజపేట శివారులో రైతుల రాస్తారోకో!

వనపర్తి: వనపర్తి నుండికొత్తకోటకు వెళ్లే రోడ్డు రాజపేట శివారులో లారీలు ట్రాక్టర్లలో ఉన్న ధాన్యాన్ని దింపుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించిన రైతులు

ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ

నెల 15 రోజులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని పోసుకుని ఉన్నాము. తూకం చేసిన తర్వాత లారీలు సకాలంలో రావడం లేదు. లారీలు లేవని ట్రాక్టర్లు తీసుకొని వస్తే కూడా ధాన్యం దించుకోవడం లేదు. వచ్చిన వెంబడే ధాన్యాన్ని దించుకోకపోవడం వలన రోజుకు దాదాపు 3 వేల రూపాయలు కిరాయి రూపంలో మాకు అదనపు భారం పడుతుంది.

ప్రభుత్వం కట్టించే కిరాయి ట్రాక్టర్లకు సరిపోదు. ట్రాక్టర్లో నిండా ధాన్యం ఉంది దానిపైన కవర్లు లేవు వర్షం వస్తే మొత్తం తడిసి ధాన్యం మొలకెత్తుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టం వాటిల్లకుండా తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu