Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Wanaparthy: వనపర్తిలో మంత్రి జూపల్లి సందడి గ్రంథాలయానికి కోటి నిధులు!

Wanaparthy: వనపర్తిలో మంత్రి జూపల్లి సందడి గ్రంథాలయానికి కోటి నిధులు!

hmtv 1 week ago

Wanaparthy: వనపర్తిలో మంత్రి జూపల్లి సందడి గ్రంథాలయానికి కోటి నిధులు!

వనపర్తి: సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలని, కుటుంబ ఖర్చుల్లో కొంత భాగాన్ని పుస్తకాల కొనుగోలుకు వెచ్చిస్తే జ్ఞాన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు..బొకేలకు ఖర్చు చేసే సంస్కృతికి స్వస్తి చెప్పి, ఆ డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతామని,శాలువాలు బొకేలకు వెచ్చించే ఖర్చును పుస్తకాలపై పెట్టి వాటిని డొనేషన్ ద్వారా గ్రంథాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. గ్రంథాలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని ఎమ్మెల్యే మెఘా రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu