Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Warangal: విద్యుత్ ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే నాయిని ఆర్థిక సాయం!

Warangal: విద్యుత్ ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే నాయిని ఆర్థిక సాయం!

hmtv 3 weeks ago

Warangal: విద్యుత్ ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే నాయిని ఆర్థిక సాయం!

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ జూలైవాడకు చెందిన నేరెళ్ల నవీన్ - ప్రియాంక దంపతుల కుమారుడు నేరెళ్ల శ్రేయాన్ భార్గవ్ ఇటీవల విద్యుత్ ప్రమాదంలో గాయపడిన ఘటనపై స్పందించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.3,16,000ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించి, రూ.3.16 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్,డివిజన్ ఇంచార్జ్ కౌటిల్ రెడ్డి,నాయకులు మానస రామ్ ప్రసాద్,నేపాల్ రెడ్డి,రాజ్ కుమార్ విద్యుత్ శాఖ DE సాంబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu