Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో మహిళ అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ మహిళ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డిపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి వసుంధర (32) ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఆమె మరిది తమ్మిశెట్టి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. వసుంధర భర్త తమ్మిశెట్టి సూర్యనారాయణ ఈ నెల 13వ తేదీ సాయంత్రం బంధువుల వివాహానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి వసుంధర కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు.
దీంతో లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన వసుంధర ఆచూకీ తెలిసిన వారు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

