Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Yellareddypet: ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

Yellareddypet: ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

hmtv 2 weeks ago

Yellareddypet: ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

ఎల్లారెడ్డిపేట: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) అవగాహన సదస్సు నిర్వహించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన BLA అవగాహన సదస్సుకు నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలిసి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా తోట ఆగన్న మాట్లాడుతూ, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు నమోదు కాకుండా ప్రతి BLA బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన అభ్యంతరాలు, దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమర్పించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu