ఆద్యంతం వినోదభరితంగా 'పురుష:' ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'పురుష:'.
ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
'బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది' అని వెన్నెల కిషోర్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 'ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది.. నిజాయితీ లేని నీలాంటి వాడితో నేను ఉండలేను' అని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. 'పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు' అనే డైలాగ్స్ ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ, యూత్, మాస్ ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు.

