చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ 'మరీచిక' ట్రైలర్ విడుదల.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథ.. మే 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ 'మరీచిక'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
'మరీచిక' ట్రైలర్‌ను గమనిస్తే ఎమోషన్స్‌తో పాటు మిస్టరీ అంశాలతో ప్రారంభమైంది. ఇందులో వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా.. మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించారు. సంజుని మరీచిక చంపేసిందంటూ అనుపమ పరమేశ్వరన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం.. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్.. తర్వాత సంజు పాత్రను పరిచయం చేయటం.. తర్వాత మరీచిక పాత్రను పరిచయం చేయటం.. ఏ పాత్రకు ఆ పాత్ర మరో పాత్రతో సంబంధం ఉన్నట్లు, లేనట్లు చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఎన్నారై అమ్మాయి మరీచిక పాత్రలో రెజీనా కనిపించింది. ఈ మూడు పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, టర్నులతో సినిమా ఉండనుందని ట్రైలర్‌తో తెలుస్తోంది.

