రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది.
"కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది" అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. సంజన RJ & సింగర్. తనకి చుపులేదు.. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్ గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి

