Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" స్నీక్ పీక్ రిలీజ్  -ఈనెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" స్నీక్ పీక్ రిలీజ్ -ఈనెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" స్నీక్ పీక్ రిలీజ్

-ఈనెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి".

ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర స్నీక్ పీక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

"చిరంజీవి" సినిమా స్నీక్ పీక్ ఎలా ఉందో చూస్తే - చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్, ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపించారు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది "చిరంజీవి" సినిమా

నటీనటులు - కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు

టెక్నికల్ టీమ్
-------

డీవోపీ - రామకృష్ణ
మ్యూజిక్ - శేఖర్ చంద్ర
ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - యష్ మిట్టల్
కొరియోగ్రఫీ - గోవింద్, శుభ సాయి వెంకట్
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభా సాయి వెంకట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Industry Hit Telugu