Friday, 16 Mar, 4.10 am జనం మనం

తాజా వార్తలు
వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?

వైశ్రాయ్ హోటల్.. ఇది.. టీడీపీ సీనియర్ నేతలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేసేవాళ్లకు సుపరిచితమే. ఇక్కడి నుంచే ఆయన వెన్నుపోటుకు రాజకీయాలకు తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అక్కడికి తరలించారు.

ఆ వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు మీరు తప్పా ఎన్టీఆర్ పక్షం వీడి.. అందరూ చంద్రబాబు వర్గంలోకి వచ్చారని.. చెప్పారు. దీంతో తాము తప్పా.. అందరూ ఎన్టీఆర్ ను వీడారని అక్కడ ఎవ్వరూ లేరని చంద్రబాబు గూటికి చేరారు. అప్పటి టీడీపీ అనుకూల పత్రికల ద్వారా ఎన్టీఆర్ ను వీడి.. ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు కలిసిపోయారని కథనాలు వడ్డించారు. అనంతరం ఎన్టీఆర్ ను గద్దెదించారు.

ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబునాయుడు మళ్లీ వైశ్రాయ్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొదటి నుంచి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తూ వచ్చారు. అనంతరం జనాల్లో వ్యతిరేఖత వ్యక్తం కావడంతో ఎన్నికల్లో గెలవమని యూటర్న్ తీసుకున్నారు. మెల్లిగా పత్రికలు ద్వారా హోదా ఇవ్వనందుకు బీజేపీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లీకులిచ్చారు.

అనంతరం నిందను బీజేపీపై నెట్టేసి, ఎన్టీయేతో కటీఫ్ చెెప్పేశారు. గుంటూరు సభలో పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో దిక్కుతోచక అసెంబ్లీని వేదిక చేసుకుని తనకంటే గొప్పవారు లేరంటూ పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. తనకు తానే క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు.

వైఎస్సార్ సీపీ ముందస్తుగా బీజేపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో తెలివిగా ముందు మద్ధతు ప్రకటించారు. మళ్లీ రాత్రికి రాత్రే నిర్ణయం మార్చేసుకుని ఉదయానికల్లా టీడీపీ తరపున కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్, త్రుణమూల్, తదితర పార్టీలన్నీ మద్దతు తెలిపిందని తన అనుకూల మీడియా ద్వారా అప్పటికప్పుడే ప్రచారం చేయించారు. అయితే తాము అవిశ్వాసానికి మద్దతు తెలపలేదని, ఎవ్వరూ తమ అధిష్టానాన్ని సంప్రదించలేదని అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. త్రుణమూల్ కూడా మద్దతిస్తామనడంలో నిజం లేదని కొందరు నేతలు అంటున్నారు.

ఇదికాకా వైెస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో ఎప్పుడో మాట్లాడారని, తాను టీడీపీ వెంటలేని జగన్ కే తన మద్దతు అని పవన్ చెప వరప్రసాద్ తో తెలిపినట్లు ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పవన్, బీజేపీ, వైఎస్సర్ సీపీ ఒక్కటేనని రాష్ట్రం కో్సం తాను తాను మాత్రమే పోరాడుతున్నానన్న సింపతి ప్రజల్లో వచ్చేవిధంగా చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా వైఎస్సార్ సీపీ, బీజేపీ, జనసేనను శత్రువులుగా చూపేందుకు పేపర్ కటింగ్ లను తీసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అయితే ఈ వెన్నుపోటు రాజకీయాలు ఎన్టీఆర్ హయాంలో పనిచేశాయని, ఇప్పుడు పనిచేయవని ప్రజలంతా గమనిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

JanamManam
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: janammanam telugu
Top