సర్పంచ్ నరేందర్ రెడ్డి,కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
తలకొండపల్లి(ఆమనగల్)మే15 (జనంసాక్షి):కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.ఆమనగల్ మండల పరిధి ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ నరేందర్ రెడ్డి,వార్డు మెంబర్స్,కార్యకర్తలు,మహిళలు సుమారు 100మంది ఎమ్మెల్యే సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆమనగల్ పట్టణంలోని కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయిని,తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతున్నదన్నారు.రాష్ట్రంలో ఉన్న రైతాంగం,తో పాటు అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రతి పథకం అన్ని వర్గాలకు,ప్రతి ఇంటికి చేరుతున్నదన్నారు.అందుకే అటు బిజెపి,ఇటు బిఆర్ఎస్ పార్టీలకు నిద్ర పట్టడంలేదని,వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే తెలిపారు.కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరిందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మన రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామీగా ముందుకు దూసుకెళ్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్,ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్యా నాయక్,మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ,గూడూరు శ్రీనివాస్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,ఏఎంసి డైరెక్టర్ శ్రీశైలం,నాయకులు గుర్రం కేశవులు,పయ్యావుల రమేష్,మెకానిక్ బాబా,రాజేందర్ నాయక్,రాజు నాయక్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

