Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బావిలో ఈతకు వెళ్లి. యువకుడు మృతి

బావిలో ఈతకు వెళ్లి. యువకుడు మృతి

ర్కొండ మే 16, ( జనం సాక్షి ) ; బావిలో ఈత కొడుతూ మునిగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఊరుకొండపేట శివారులో శనివారం అదే గ్రామ పంచాయతీ కార్మికురాలు వర్కల మల్లమ్మ చెల్లెలి కుమారుడు కాలే అనిల్ (20) పెద్దమ్మ వద్ద ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉండగా శనివారం గ్రామ శివారులోని బావిలో తన సోదరులు, మిత్రులతో కలిసి సుమారు గంటపాటు ఈత కొడుతున్న సందర్భంలో బావిలో 30 మందికి పైగా ఈత కొడుతున్న సమయంలో వెంట వచ్చిన వారు కనపడటం లేదు అని గాలించగా ఎక్కడ యువకుని జాడ కనిపించక పోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ కల్వకుర్తి ఫైర్ ఆఫీసర్ కు సమాచారం అందించగా కల్వకుర్తి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది బావిలో మునిగిపోయి ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటికి తీసారు.అప్పటికే మృతి చెందినాడు. బావి వద్దకు కుటుంబ సభ్యులు చేరుకొని కన్నీరు మున్నిరయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మృతి చెందిన బాలుడు కాలే అనిల్ తండ్రి కృష్ణయ్య, వయస్సు 20, చౌదరపల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా గా తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi