Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్‌పై అదనపు సెక్షన్లు

బండి భగీరథ్‌పై అదనపు సెక్షన్లు

రింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్(జనంసాక్షి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ అదనంగా చేర్చారు. బీఎనఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను నమోదు చేశారు.

బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్ దర్యాప్తు అధికారులు జత చేశారు. దీనిప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కోసారి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. నెల 8న బాధితురాలైన మైనర్‌పై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆమె తల్లి పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినప్ప్పుడు.. పోలీసులు హైడ్రామా మధ్య సెక్షన్ 74, 75 అఫ్ బీఎనఎస్, సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 మేరకు కేసులు నమోదు చేశారు. ఆ తరువాత బాధితురాలి నుంచి మహిళా అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలు నిజం చెప్పకుండా ఉండేలా ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగడంతో.. ప్రభుత్వం సోమవారం కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. వెంటనే దర్యాప్తును చేపట్టిన రితిరాజ్ సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఘటన గురించి ఆరా తీశారు. అప్పటికే పోలీసులు బాధితురాలి నుంచి తీసుకున్న వాంగూల్మాన్ని పరిశీలించారు. అందులో స్పష్టత లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నేరుగా బాధితురాలిని కలిసి జరిగిన విషయం తెలుసుకున్నారు. పోక్సో కేసు దర్యాప్తులో మహిళా అధికారులు ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితురాలి నుంచి జరిగిన ఘటనకు సంబంధించిన అంశాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రితిరాజ్ నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో చాలాసేపు మాట్లాడినట్టు తెలిసింది. బాధితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేని విషయాన్ని ఆమె గుర్తించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1), 6ల పరిధిలోకి వస్తాయి. బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్టు ఆరోపణలుంటే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చట్టం సూచిస్తున్నది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జరిగిన నేరం అత్యంత తీవ్రమైనదని గ్రహించిన డీసీపీ ఆ మేరకు కేసులో సెక్షన్లను అలర్ట్ చేయించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను జోడించారు. సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే.. నిందితుడికి 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయ

కోట్లు ఖర్చు పెట్టి తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు
` బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ అసత్యప్రచారాలు చేస్తున్నాడు
` ఆయన తప్పు చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే.. న్యాయపరంగా చర్యలుంటాయి
` తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్(జనంసాక్షి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు భాజపాపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దుష్పచారం చేస్తున్నాయని తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. వ్యక్తిని, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. "బండి సంజయ్, భాజపాపై బీఆరఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. రూ.కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా పోస్టర్లు వేయించారు. బండి సంజయ్ తప్పు చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే.. న్యాయపరంగా చర్యలుంటాయి. సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.బీఆరఎస్ హయాంలో మహిళలపై 67 శాతం క్రైమ్ రేటు పెరిగింది. జూబ్లీహిల్స్ బాలిక కేసులో కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా?మద్యం కేసులో మహిళ జైలుకు వెళ్తే.. రాజీనామా చేశారా? ఓ మహిళా సర్పంచి తనను బీఆరఎస్ ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు? కేటీఆర్‌కు నైతిక విలువలు లేవు. విÖ ఇంటి ఆడబిడ్డ తప్పు చేస్తే ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రజా సమస్యలపై పోరాటం చేయడం చేతగాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కాళేశ్వరం, ఈ`కారు రేస్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలి. కాంగ్రెస్, బీఆరఎస్ కలిశాయి కాబట్టే వారిని అరెస్టు చేయడం లేదు" అని రామచందర్‌రావు అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi