Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయండి

బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయండి

` పోక్సో కేసులో కుమారుడిని దాచిపెట్టాడు ` నిందితుడికి సహకరించడం నేరమే
` పదవి తొలగించకపోతే కేసులో విచారణ సరిగా జరగదు
` ఆయన కేంద్రమంత్రిగా కొనసాగడం దేశానికే అవమానం

` ప్రధాని మోదీ చెబుతున్న 'బేటీ పడావో.. బేటీ బచావో' నినాదం కేవలం మాటలకే పరిమితమైంది
` బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
` ఒక బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయింది
` న్యాయం జరిగేలా బీఆరఎస్ పార్టీ మాత్రమే పోరాడింది
హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్బీనగర్‌లో నిర్వహించిన 'నా బూత్` నా భవిష్యత్తు' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోక్సో కేసులో అరెస్టైన నేపథ్యంలో కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బాధితురాలికి అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ విమర్శించారు. కానీ ఆ బాలికకు న్యాయం జరిగేలా బీఆరఎస్ పార్టీ మాత్రమే పోరాడిందని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చెబుతున్న 'బేటీ పడావో.. బేటీ బచావో' నినాదం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. దేశ చరిత్రలో బహుశా మొదటిసారి ఓ కేంద్రమంత్రి కుమారుడిపై లుకౌట్ సర్క్యులర్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు.బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఈ కేసులో విచారణ సరిగా జరగదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. తప్పు చేసిన వ్యక్తిని దాదాపు తొమ్మిది రోజులపాటు దాచిపెట్టింది కేంద్రమంత్రేనని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసి కేసును నీరుగార్చాలని చూశారన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం తెలంగాణ రాష్టానికేగాక దేశానికే అవమానమని మండిపడ్డారు.ఇదిలా ఉంటే సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. బండి సంజయ్ ఆదేశాల మేరకు లొంగిపోయాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ప్రెస్ విÖట్‌లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి బదులిస్తూ.. బండి సాయి భగీరథ్ సరెండర్ అయిపోయాడు కదా.. ఇంకా ఇష్యూ ఏముంది అని అన్నారు కిషన్ రెడ్డి. ఈ కామెంట్స్‌తో పోలీసుల వాదన వాస్తవం కాదని తేటతెల్లమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ కానీ వ్యవస్థ కానీ వేరుగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో మా అమిత్ షా విమానం దిగుతుంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. యÖపీ సీఎం విమానం దిగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అనుమతివ్వకపోతే పక్కనున్నట్వంటి ఒడిశా రాష్ట్రంలో దిగి.. అక్కడి నుంచి రోడ్డు వెంట వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించిన అంశం.. రాష్ట్ర పోలీసులకు పూర్తి అధికారం ఉంటుంది. దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కేంద్రప్రభుత్వానికి ఇందులో ఏం ప్రమేయం ఉండదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi