గంభీరావుపేట మే 5(జనంసాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,దుదిల్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లు భూమి పూజ నిర్వహించారు.ఈ ప్రాంతంలో గడ్డిని పెంపు చేసి దాని ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంటు నిర్మాణం చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,కటుకం మృత్యుంజయం,జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

