Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బేగంపేటలో జింక మృతి

బేగంపేటలో జింక మృతి

మే 15, ( జనం సాక్షి ) ; యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవసాయ పొలంలో జింక మృతదేహం కనిపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.

జింక సహజ మరణమా? ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చల్లూరు నుంచి బేగంపేట వెళ్లే రోడ్డులో ఈ వ్యవసాయ భూమి ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi