జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నూతనంగా 6ఇంక్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ మురుకుంట్ల తిరుపతిలు ప్రత్యేక పూజలు చేసి, పనులను ప్రారంభించారు.
గతంలో 6 ఇంక్లైన్ పనులకు పర్మిషన్ లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కార్మికులను బదిలీ చేసే పనులు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవలే పర్మిషన్ రావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలను నిలిపి వేశారు. ఎట్టకేలకు పర్మిషన్ రావడంతో సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ తిరుపతిలు పనులను ప్రారంభించారు. భూపాలపల్లిలో నూతనంగా 6 ఇంక్లైన్ పనులు ప్రారంభం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక ఐఎన్టియుసి నాయకుల ఆధ్వర్యంలో సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డిని, ఏజెంట్ మురుకుంట్ల తిరుపతి లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రెటరీ బొడ్డు అశోక్, పిట్ సెక్రెటరీ చిరుత లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్, అజ్మీర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

