` ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ` కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోంది
` ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్
` సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదు
` ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు
` మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం డబ్బులిస్తున్నా.. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. "ఎన్నికల్లో ఇచ్చిన హావిÖలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వమే వారికి సమాధానం చెప్పాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి" అని కిషన్‌రెడ్డి విÖడియా సమావేశంలో అన్నారు.

