` కాంగోలో విస్తృతంగా వ్యాపించిన వైరస్ ` 88మంది ప్రాణాలు కోల్పోగా మరో 300మంది సోకిన మహమ్మారి
` హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
` పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు
బ్రాజవిల్లె(జనంసాక్షి):ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా మరో 300మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా..
కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందడమని వెల్లడించింది. ప్రాథమిక నమÖనాలలో అధిక పాజిటివిటీ రేటు..
వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ఈ వైరస్‌కు ప్రత్యేకంగా అమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్‌లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని, సరిహద్దుల వెంబడి స్కీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మÖసివేయవద్దని..
ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్ధరణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి.. వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది.

