Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏకో టౌన్‌కు వ్యతిరేకంగా దేశ్‌ముఖి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

ఏకో టౌన్‌కు వ్యతిరేకంగా దేశ్‌ముఖి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

మైనింగ్ భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దంటూ గ్రామసభలో నిరసన

భూదాన్ పోచంపల్లి, మే 18 (జనం సాక్షి): మండలంలోని దేశ్‌ముఖి గ్రామంలో శనివారం అత్యవసర గ్రామసభను సర్పంచ్ దుర్గం జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.

రావిరాల పరిధిలోని 265 సర్వే నంబర్లలో దేశ్‌ముఖి శివారులో గల 494 ఎకరాల మైనింగ్ భూమిని "ఎకో టౌన్" పేరుతో డంపింగ్ యార్డ్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తమ గ్రామ పరిధిలో ఎకో టౌన్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ నూకల అశోక్ యాదవ్, వార్డు సభ్యులు దుర్గం మాధురి, చంద్రశేఖర్, దుర్గం లింగస్వామి, చింతపట్ల నరేందర్, దుర్గం మంగా, దేవేందర్, పోతుల శ్యామ్, ఉప్పునూతల సునీత వెంకటేష్, ఘనమోని కుమార్ యాదవ్, జక్కలి మహేశ్వరి, శంకర్ యాదవ్, ఇరుగు రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi